ఇంటర్ కాలేజీ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జూన్ 2 నుండి 15వ తేదీ లోపు బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని కమిషనర్ ను ఆదేశించింది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీ చేయనుంది. అనుభవం లేని వారు కూడా బదిలీకి అప్లై చేసుకోవచ్చని తెలిపింది. కాగా, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలకు, 2025 మే 31 లోపు రిటైర్మెంట్ అయ్యేవారికి దీనినుండి మినహాయింపు ఇచ్చింది.