ఆకలితో అల్లాడుతున్న అభాగ్యుల ను ఆదుకునేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పలుకూరు వెంకటరమణ అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల కొన్ని రోజులుగా ఆహారం అందించడం లేదు. ఇటువంటి తరుణంలో రోగులు వారి వద్ద ఉన్నటువంటి బంధువులు సకాలానికి భోజనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తమ దృష్టికి రావడం జరిగింది. వారు స్పందించి మంగళవారం రోగులకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.