గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో బుధవారం పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నాయకులు బైక్ ర్యాలీకి పిలుపునివ్వడం, మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ తుళ్ళూరు మండల కేంద్రంలోని రైతు దీక్ష శిబిరంలో 48 గంటలు నిరాహార దీక్ష కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తుళ్ళూరు మండలంలో 144 సెక్షన్ అమలులో ఉందని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.