ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 24, 2023, 11:25 AM

పెడన నియోజకవర్గం పెడన పట్టణం పెడన జనసేన పార్టీ కార్యలయంలో పెడన నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ యడ్లపల్లి రామ్ సుధీర్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, ప్రజలు ఈ సారి అయినా విజ్నతతో ఓటు వేయాలని తెలిపారు. మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని ఆన్నారు. గెలిపించినా, గెలిపించకున్నా, ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా నిలబడిన నాయకుడు జనసేన పార్టీ ఆధినేత పవన్ కళ్యాణ్ ఒక్కడే అని ఆన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని తెలిపారు. పెడన నియోజకవర్గ ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అభివద్ధి అంటే ఇది అని చూపెడతామని తెలిపారు. వైసీపీ కబంధ హస్తాల నుంచి పెడనను బయటపడేయడమే లక్ష్యంగా పని చేస్తాం అని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com