రాపిడో సంస్థ మన విజయవాడ నగరంలో మహిళలకు ప్రత్యేకంగా మహిళ రైడర్ల సర్వీసును అందిస్తున్నామని ఆ సంస్థ విజయవాడ మేనేజర్ ప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాపిడో బైక్ ట్యాక్సీ సంస్థ విజయవాడ నగరములో స్థాపించి ఆరు సంవత్సరాలు కావుస్తున్న సందర్భముగా మహిళల హక్కులు మరియు వారి సాధికారత కోసం పురుషులతో సమానంగా మహిళా రైడర్ సర్వీస్ లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. రాపిడో మహిళ రైడర్ సర్వీసులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సోమవారం ప్రారంభించారని తెలియజేశారు. ఇప్పుడు నగరంలో ప్రతి మహిళ స్వేచ్ఛగా రాపిడో బైక్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.