కృష్ణాజిల్లాలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లను సన్మానించే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులు ఆదేశించారు. మచిలీపట్నం లో మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు. క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన, జగనన్న ఆణిముత్యాలు, వాలంటీర్లకు వందనం, మిషన్ లైఫ్, గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అంకితభావంతో కృషిచేసి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా విజయవంతం చేశారని, అందులకు అందరిని అభినందిస్తున్నానన్నారు.
ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం చాలా గొప్ప విషయం. అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఈనెల 25వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, ఈనెల 27వ తేదీన జిల్లా స్థాయిలో సన్మానించడానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. అలాగే వాలంటీర్లకు వందనం కార్యక్రమం కింద అత్యుత్తమ పనితీరు కనపరచిన వాలంటీర్లను కూడా సత్కరించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వారం అంతా గృహ నిర్మాణ వారోత్సవాలుగా పరిగణించాలని అధికారులకు సూచించారు.