పీఎం కిసాన్ సామాన్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన రైతులు ఈ నెల 30లోపు ఈకేవైసీ నమోదు చేసుకోవాలని ముప్పాళ్ళ మండల వ్యవసాయాధికారి ఎమ్. అరుణ మంగళవారం చెప్పారు. మండలంలో మొత్తం 7, 210 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 5, 749 మంది రైతులు మాత్రమే ఈకేవైసీ నమోదు చేసుకున్నారన్నారు. మిగిలిన 1, 461 మంది రైతులు గ్రామంలోని ఆర్బీకేలో ఈకేవైసీ నమోదు చేసుకోవాలన్నారు.