నందిగామ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సబ్జ అజయ్ అరెస్ట్ నందిగామ నియోజకవర్గంలో సంచలనం కలిగించింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరు జిల్లా చిలకలూరిపేట వాస్తవ్యుల వద్ద మూడు కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మంగళవారం రాత్రి పది గంటలకు ఆయన నివాసంలో చిలకలూరిపేట పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం మూడు కోట్ల రూపాయలు వసూళ్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిత్ర బృందంతో కలిపి మొత్తం మూడు కోట్ల రూపాయలు ఉంటుందని బాధితులు ఆరోపణ. సజ్జ అజయ్ ను చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.