ఇబ్రహీంపట్నం: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం సడక్ రోడ్ లో గల జగనన్న ఇళ్లను మంగళవారం నాడు కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు కౌసల్ కిషోర్ పరిశీలించారు. స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు, కొందరు లబ్ధిదారులు ఇంకా తమకు బిల్లులు అందలేదని అందువల్లే నిర్మాణం సగంలోనే ఆపేసామని ఆయనకు తెలిపారు. అధికారుల నుంచి వివరాలు సేకరించి త్వరగా బాధ్యతలకు బిల్లులు అందేలా చేయాలని, నిర్మాణం కూడా వేగవంతం చేయాలని ఆదేశిం చారు. అదేవిధంగా కొండపల్లి మున్సిపా లిటీలో బోర్డు లేకపోవడం వల్ల రోడ్లు మరియు మౌలిక వసతులు లేవని స్థానిక బిజెపి నేతలు కేంద్రమంత్రి కి వివరించారు.
అధికారులతో మాట్లాడి మౌలిక సదుపాయాలు మరియు రోడ్లు సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలావరకు ఉందని, ప్రధాని మోడీ ప్రతి పేదవాడికి ఇంటి సదుపాయం కల్పించాలని సంకల్పంతో ఉన్నారని, ఆయన సూచనతోనే ఇళ్ల నిర్మాణం పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు. కర్ణాటక ఓటమి కేంద్రంపై ఎలాంటి ప్రభావం చూపుదని 2024 ఎన్నికల్లో తిరిగి బిజెపి ప్రభుత్వం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో పోత్తులపై కేంద్ర నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి కాజా కిరణ్, మైలవరం కన్వీనర్ కుక్కపల్లి నాగేశ్వరావు, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు కూరపాటి శివ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రేగళ్ల రఘురాధ రెడ్డి, స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.