ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రైతులు, ప్రజల కోసం పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు నియోజక వర్గాలలో మూడు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, అందులో రెండు పూర్తి కావచ్చాయని అన్నారు. అయితే చంద్రబాబు కక్షపూరితంగా సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రాజెక్టులపై స్టే తీసుకువచ్చారన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారన్నారు.