కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పార్లమెంటులో పాస్ కాకుండా చూస్తామని శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్‌కు హామీనిచ్చారు. మోదీ ప్రభుత్వం 2024లో అధికారాన్ని చేపట్టబోదని ఉద్ధవ్ చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని తెలిపారు. తమను ప్రతిపక్ష పార్టీలని పిలవకూడదన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కేంద్రమే అసలైన ప్రతిపక్షమన్నారు.