కర్ణాటక మాజీ మంత్రి, ఐదు సార్లు కాంగ్రెస్ MLA యూటీ. ఖాదర్ అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిని చేపట్టిన మొదటి ముస్లింగా రికార్డు సృష్టించారు. కర్ణాటకలో స్పీకర్ పదవిని గతంలో ముస్లింలెవరూ చేపట్టలేదు. యూటీ. ఖాదర్ పేరును కర్ణాటక CM సిద్ధ రామయ్య ప్రతిపాదించారు. ఎవరూ కూడా ఆ పదవికి పోటీపడకపోవడంతో ఖాదర్ ఎన్నిక ఏకగ్రీవమైంది.