కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పాలనాపరమైన పనుల్లో మునిగిపోయారు. తాజాగా నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పోలీసులను కించపరిచే పనులను చేయబోదన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డీకే నోటి నుంచి ఇలాంటి మాటలు వింటుంటే సంతోషంగా ఉందని అంటున్నారు. మరికొందరు ఇలాంటి మాటలు ఆశ్చర్యకరమని చెప్తున్నారు.