టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసులో అరెస్టయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 17న నంద్యాలలో నారా లోకేశ్ పాదయాత్ర నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో అఖిలప్రియ, ఆమె భర్తపై కేసు నమోదైంది. 17న పోలీసులు వారిద్దరినీ కోర్టు ఎదుట హాజరు పరచగా వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఆమె బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా బుధవారం కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది.