పంటకోత అనంతరం నేలలో లోతు దుక్కులతో అనేక ప్రయోజనాలని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. నేల గుల్లబారి వర్షం నీరు ఇంకడానికి అనువుగా తయారవుతుంది. పంటలను ఆశించే కీటకాల గుడ్లు మట్టి లోపల పొరలి నుంచి బయట పడి ఎండవేడికి నాశనమవుతాయి. తద్వారా పంటను ఆశించే తెగుళ్లు నివారించవచ్చు. సులువుగా కలుపు నివారణ చెయ్యొచ్చని పేర్కొంటున్నారు. భూసారం పెరుగుతుందని చెబుతున్నారు.