మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాస్తవానికి ఈ పిటిషన్‌పై విచారణ జూన్ 5కు వాయిదా పడగా, అవినాష్ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో సుప్రీం గురువారం విచారణ జరిపి తీర్పు వెలువరించాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.