మణిపుర్‌లో ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి సరకు రవాణా ట్రక్కులను రాష్ట్రంలోకి రానివ్వకపోవటంతో సరఫరా నిలిచిపోయి పలు వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. బియ్యం, బంగాళదుంప, ఉల్లిగడ్డ, కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. 50కిలోల బియ్యం ధర రూ.900 నుంచి రూ.1800లకు చేరింది. వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో బ్లాక్‌మార్కెట్‌లో ఒక్కో సిలిండర్ ధర రూ.1800లకు పెరిగింది. ఇక, లీటర్ పెట్రోల్ ధర రూ.170కు పెరిగింది.