ప్రపంచ దేశాల్ని కరోనా వైరస్ పట్టి పీడించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కంటే ప్రాణాంతకమైన మహమ్మారి భవిష్యత్తులో రావచ్చని, ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను నివారించడానికి వెంటనే చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు జెనీవాలో జరిగిన వార్షిక ఆరోగ్య సదస్సులో పేర్కొన్నారు.