కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు భారత వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. దేశంలో హీట్ వేవ్ ముగిసిందని, నేటి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, చండీగఢ్‌లో తుఫాను సూచనలు ఉన్నందున ఆ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. రాబోయే 2-3 రోజుల పాటు కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.