పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ దినసరి కూలీ బ్యాంక్ అకౌంట్లో ఏకంగా రూ.100 కోట్లు జమ అయ్యాయి. దేగంగాలోని వాసుదేవ్పుర్కు చెందిన మహ్మద్ నసీరుల్లా(26) వ్యవసాయ కూలీ. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో ఇటీవల రూ.100 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆయనకు జంగీపుర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు. మే 30 లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ డబ్బులు ఎవరు వేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.