అచ్యుతాపురం: పాత రక్షణ గోడ కూలి కార్మికుడు అందనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఈ దుర్ఘటన మోసయ్యపేటలో జరిగింది ఉపాధిని అందించిన సామిలే శాశ్వతంగా సమాది కట్టింది. ఎస్సై సన్యాసినాయుడు కథనం ప్రకారం. ఈ గ్రామా నికి చెందిన ముచ్చు గోవిందు (55) సామిలల్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడుఇతనికి భార్య సైడమ్మ, కుమారుడు రాజు, కుమార్తె సునీత ఉన్నారు. బుధవారం పనిలేకపోయినా సామిల్లు కు వెళ్లాడు. కొంతసేపటి తరవాత రక్షణ గోడ గోవిందుపై కూలిపోవడంతో మృతిచెందాడు. అప్పటివరకు అందరిలో కలివిడిగా మాట్లాడిన ఆయనను మృత్యువు గోడ రూపంలో కబళించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి మిల్లు నిర్వాహకుడు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చారు. గ్రామ పెద్దల మధ్య జరిగిన చర్చల్లో ఈ ఒప్పందం జరిగిందని సర్పంచి పంచదార పైడిరాజు, అప్పుడు, తెలిపారు. గోవింద భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలపారు.