ఈ నెల 25న అనకాపల్లి పట్టణంలో అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం ఏపీ రాష్ట్ర మహా సభ నిర్వహించనున్నట్టు అఖిల భారత వ్యవసాయ సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ కుమార్ చెప్పారు. బుధవారం ఈ మేరకు అనకాపల్లిలో మీడియాతో మాట్లడారు. ఈ మహాసభకు సంఘం జాతీయ అధ్యక్షులు సత్య దేవ రాం, బీహర్ ఎమ్మెల్యే ధ్రిరేంద్ర ఝు తదితరులు హాజరుకానున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర పభుత్వం తీసుకు వస్తున్న మార్పులు , గ్రామీణ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతేసే విధంగా వున్నాయని ఆరోపించారు. వివిధ అంశాలపై మహాసభలో చర్చించనున్నట్టు అజయ్ కుమార్ చెప్పారు.