విశాఖపట్టణం ఆనందపురం మండలంలో రోడ్డు భద్రతా నియ మాలు పాటించి నట్లయితే ప్రమాదాలు నివారించవచ్చునని ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ రఘురాం పేర్కొ న్నారు బుధవారం పాలవలస గ్రామంలో ట్రాఫిక్ నిబంధనాలపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. వాహనంతో రోడ్డు ఎక్కితే రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ముగ్గురు ఒకే వాహనం మీద వెళ్ళకూడదని, సెల్ఫోన్ డ్రైవింగ్ చెయ్యకూడదని, రోడ్డు దాటేటప్పుడు నిదానంగా దాటాలని, మైనర్లకి వాహనం ఇవ్వకూడదని, లైసెన్స్ వున్న వాళ్లు మాత్రమే వాహనం నడపాలని, స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళ యువత ప్రాణాలు కోల్పోతున్నారని, అందువలన యువత స్పీడ్ డ్రైవింగ్ చెయ్యకూడదని, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.