గాజువాక నియోజకవర్గ పరిధిలోని అగనంపూడి బస్సు స్టాప్ లో వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని చూసి దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తెలిపిన వివరాల మేరకు అగనం పూడిలోని డొంకడ గ్రామానికి చెందిన చంద్రపాటి బొర్రయ్య (43) గా గుర్తించారు. ఆయనకు భార్య లక్ష్మి ఒక కుమారుడు ఉన్నాడు యశ్వంత్ ఫార్మాసిటీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బొరయ్య పేద కుటుoబానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు అందించాలని ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ చంద్ర దుర్గారావు కోరారు.