పారిశుద్ధ్య పనులు సమన్వయంతో నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 52 వ వార్డు పరిథి శాంతినగర్ తదితర ప్రాంతల్లో డిప్యుటీ మేయర్ జియాని శ్రీధర్ జీవీఎంసీ జోన్ -5 కమిషనర్ ఆర్. జి. వి కృష్ణ తో కలిసి గురువారం ఉదయం ఆయన పర్యటించారు. పర్యటనలో బాగంగా జియాని శ్రీధర్ వార్డులో జరగవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.
వార్డు పరిధిలో ఓపెన్ డ్రెయిన్లు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ పనులను నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ పనులపై అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ను పరిశీలించిన ఆయన అబివృద్ధి విషయంలో ప్రజలు సహకరించాలని సూచించారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముందస్తూ చర్యల్లో బాగంగా ఆయాప్రాంతాల్లో ప్రధాన గెడ్డల్లో పూడిక తీసివేత పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆయన వెంట డిఈ ఏడూ కొండలు, సహాయ వైద్యాధికారి ఏ. రాజేష్ సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.