భార్యాభర్తల గొడవల నేపథ్యంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో భార్య కళ్ళ ఎదుటే బుధవారం పురుగుల మందు తాగాడు ఓ భర్త. సింగం సాగర్ కుమార్, కుమారి భార్యాభర్తలు. కుమారి ఆశా కార్యకర్తగా పనిచేస్తుంది. బుధవారం గర్భిణీని తీసుకొని ఏరియా ఆసుపత్రికి తీసుకు వచ్చింది. ఆమె వెంటే వచ్చిన సాగర్ కుమార్ ఆమెతో గొడవపడి పురుగుల మందు తాగేశాడు. అదే ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.