బంగారుపాల్యం మండలం, నలగాంపల్లెలో వెలసిన విరూపాక్షమ్మ దేవాలయాన్ని బుధవారం కంచి కామకోటి పీఠాధిపతి విజయే సరస్వతి స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు భక్తులకు పుష్పాలు, పండ్లను ఇచ్చి ఆశీర్వ దించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, మాజీ ఏఎంసీ చైర్మన్ జయచంద్ర నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు జయప్ర కాష్, సురేంద్ర నాయుడు, ఎన్పీ వెంకట్, తహసీల్దార్ బెన్నిరాజ్ పాల్గొన్నారు.