రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం లక్కిరెడ్డిపల్లె లో జరిగిన ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన డబ్ల్యూ డి సి - పి ఎం కె ఎస్ వై 2. 0 జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఉత్పాదక పెంపుదల నిధులుతో మంజూరైన లక్కిరెడ్డిపల్లె మండలంలోని బి ఎర్రగుడి డబ్ల్యూ సి సి ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకువ్యవసాయ సంబంధిత పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే స్ప్రేయర్లు, పివిసి పైపులు, ఆయిల్ ఇంజన్లు, తార్పాలిన్ పట్టలు, గడ్డి కత్తరించే చాప్ కట్టర్లు తదితర పరికరాలును వాటర్ షెడ్ ద్వారా అందిస్తున్నారన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు సమయాన్ని ఆదా చేస్తూ సకాలంలో వ్యవసాయ పనులను పూర్తి చేయుటకు దోహదం చేస్తాయన్నారు. వ్యవసాయ సాగు ఖర్చులను తగ్గించుటలో సహాయపడతాయన్నారు. పంటల దిగుబడి మరియు ఉత్పాదకతను పెంచుతూ వ్యవసాయ పనుల సామర్ధ్యాన్ని పెంచుతాయన్నారు.
వ్యవసాయ కూలీల శరీరక శ్రమను, కూలీల కొరత మరియు ఖర్చులను తగ్గించుటకు తోడ్పడతాయన్నారు.
వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ల పరిధిలోని ఎస్ సి, ఎస్ టి రైతులకు 90 శాతం సబ్సిడీ, ఓసి, బిసి రైతులకు 80 శాతం సబ్సిడీతో రైతుల కు యంత్ర పరికరాలును అందిస్తున్నారన్నారు. నియోజక వర్గ పరిధిలోని లక్కిరెడ్డిపల్లె మండలం బి ఎర్రగుడి , గాలివీడు మండలం గుండ్లచెరువు వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ల పరిధిలలో మొదటి విడతగా 796 మంది రైతులుకు రూ 1, 51, 92, 586 విలువ గల వ్యవసాయ పరికరాలు మంజూరయ్యాయన్నారు. నియోజక వర్గంలోని పలు గ్రామాలను వాటర్ షెడ్ పరిధిలోకి చేర్చాలని డ్వామా పిడి మద్దిలేటి, వాటర్ షెడ్ ఏపిడి లక్ష్మీ నరసయ్యల, పి ఓ అశోక్ రెడ్డి లకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. వాటర్ షెడ్ ద్వారా అందిస్తున్న పథకాలును రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.