రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. పార్టీపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా తనకు ఎలాంటి అసంతృప్తి లేదని క్లారిటీ ఇచ్చారు. తన రాజకీయ ప్రయాణం సీఎం జగన్ వెంటేనని స్పష్టం చేశారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.