కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేయడంపై ప్రతిపక్షాలు పునరాలోచన చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామ్ కోరారు. ‘‘పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం. ప్రధాని కూడా ఆ భవనం మెట్లను నమస్కరించే లోపలికి ప్రవేశించారు. ప్రతిపక్షాలన్నీ తమ నిర్ణయంపై ఒకసారి పునరాలోచన చేయాలని, మీ వైఖరిని మార్చుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.