పాత ప్రభుత్వాలన్నీ సామాన్యుడి సంక్షేమాన్ని విస్మరించాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఆ ప్రభుత్వాలు తమ వంశాల గురించే ఆలోచించాయి. సామాన్యుడెప్పుడూ వారి ప్రాధాన్యతల్లో లేడు. అవి హామీలు ఇచ్చాయే తప్ప ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదు. ఆఖరికి రైల్వే రంగాన్ని కూడా విస్మరించారు. కానీ మేం మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. సామాన్యుడి సంక్షేమం, సౌలభ్యం కోసం శ్రమిస్తున్నాం’’అని మోదీ చెప్పుకొచ్చారు.