రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామన్న సీఎం జగన్, మంత్రులు ఎంపీ అవినాష్‌రెడ్డి విషయంలో సీబీఐకి అడ్డుపడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్చించారు. ఇది మంచి పద్దతి కాదని, ఇలాంటి దుర్మార్గమైన చర్యల వల్ల రాష్ట్ర ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు కర్నూలు ఆస్పత్రి ముందు ధర్నాలు చేయడం తగదని సూచించారు.