అనంతగిరి మండలంలోని లుంగాపర్తి పంచాయతీ పరిధి గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ పరిధి పట్టి గ్రామంలో ఉన్న గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అనంతరం గ్రామస్తులు పాఠశాల ప్రహరీ గోడ మొత్తం కూలిపోయిందని పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa