పొగాకు ఉత్పత్తులపై మరో ఏడాది నిషేధం విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పొగాకు ఉత్పత్తులపై బ్యాన్ విధించగా దానిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు సమర్థించి నిషేధ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ అనంతరం హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.