ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి న్యూఢిల్లీని కలుపే తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. రైలు ఉత్తరాఖండ్‌లో మొదటిది కాగా భారతదేశంలో 18వ రైలు. ఈ రైలు ఈ నెల 29 నుంచి ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య పరుగులు పెట్టనుంది. 4.45 గంటల్లోనే ఈ రైలు 302 కి.మీ ప్రయాణిస్తుంది. ఢిల్లీ-డెహ్రాడూన్ టిక్కెట్ ధర ఏసీ చైర్ కార్ రూ.1,065, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ.1,890.