కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ దేశ్ పాండేను ఆయన కార్యాలయంలో జేడీఎస్ ప్రతినిధులు కలిశారు. వీరిలో కుమారస్వామి సోదరుడు రేవణ్ణతోపాటు కొత్తగా ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామిని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.