అధికారం చేపట్టాక కర్ణాటక కాంగ్రెస్ లో పదవుల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిరియూర్ ఎమ్మెల్యే డి.సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వెలుపల ఆందోళనకు దిగారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో ఆందోళనకు దిగిన కార్యకర్తలు సుధాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరింది. మొత్తం 34 మంత్రి పదవులకు గాను 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మరో 24 మంత్రి పదవులను కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌కు మంత్రి పదవి కేటాయించాలంటూ ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది.