వివేకా హత్య కేసులో సీబీఐ విచారిస్తున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 25న వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.