నకరికల్లు మండలం గుండ్లపల్లి బిసి కాలనీలో గురువారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకు తలను తండ్రి నరికి చంపాడు. గుండ్లపల్లి వడ్డెర కాలనీకి చెందిన కిషోర్ తలను తండ్రి వీరయ్య నరికి హతమార్చాడు. నిందితుడి కోసం పోలీసుల గాలిస్తున్నారు. ఈ ఘటనతో వడ్డెర కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.