ముప్పాళ్ళ మండలంలోని పలు గ్రామాలలో గురువారం భారీ వర్షం కురిసింది. చాగంటి వారిపాలెంలో విద్యుత్ స్థంబాలు, సత్తెనపల్లి - నరసరావుపేట రహదారిలో ఈదురుగాలులకు రోడ్ల వెంట చెట్లు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విద్యుత్ స్థంబాలు విరిగి పడటంతో 5, 6 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద ఆటోపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa