పొన్నూరు మండల పరిధిలోని పాండ్రపాడు, వల్లభరావుపాలెం గ్రామాలలో గురువారం ఉపాధి హామీ పనులలో పొన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జక్కా శ్రీనివాస్ పాల్గొన్నారు. డ్రెయిన్ లో జరుగుతున్న ఉపాధిహామీ పనులలో గ్రామస్థులతో కలసి పాల్గొని చాలాకాలం తరువాత స్నేహితులు మరియు ఆత్మీయులతో కలసి పనులు చేయటం ఆనందాన్నిచ్చిందని తెలుపుతూ గ్రామీణ భారతీయులకు నాటి కాంగ్రెస్ పార్టీ అందించిన ఈ బృహత్తర పథకం నేడు కోట్లాదిమందికి ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు.