గురజాల పట్టణంలోని ఆనిగ్రేస్ వృద్ధాశ్రమం సమీ పంలోని చెట్ల పొదల్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుని వయసు 50 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఒంటిపై టీషర్టు ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa