ఇంటి ముందు తాళం వేసి ఉన్న ద్విచక్రవాహనం చోరీకి గురైన సంఘటన శావల్యాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం. స్థానిక కోరమండల్ గ్రోమోర్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న సురేంద్ర రోజూ మాదిరిగానే తన ఇంటి ముందు ద్విచక్ర వాహనానికి తాళం వేసి పైకి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారి చూసే సరికి ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.