రైతనన్నకు వెన్నుదన్నుగా జగన్ ప్రభుత్వం నిలిచిందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రామాపురం మండలంలోని చిట్లూరు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రంలో నాణ్యమైన, నమ్మదగిన వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీతో ఖరీఫ్ సీజన్ లో ముందస్తుగానే అందిస్తున్నారన్నారు. 40 శాతం సబ్సిడీతో 30 కిలోల నారాయణి రకం రూ 1773 , కె 6 రకం రూ 1675 కు అందిస్తారన్నారు. అవసరమైన రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది ముందస్తు ప్రణాళికలుతో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహనా కల్పించి, విత్తన పంపిణీ సజావుగా జరిగేలా కృషి చేయాలన్నారు.