ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మెయిన్‌పురిలోని సింధియా తిరాహాలో మాధవరావు సింధియా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2001లో ఆయన అకాల మరణం చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పరిశ్రమతో సంస్థను అనుసంధానం చేయడం ద్వారా నైపుణ్యాభివృద్ధికి, ఉపాధికి కొత్త అవకాశాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.అలాగే రూ.411.49 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయగా, మరికొన్ని ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు. వీటిలో రూ.238.30 కోట్ల విలువైన 23 పారిశ్రామిక ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం చుట్టగా, రూ.173.19 కోట్లతో 40 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.