వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ సప్లిమెంటరీ కౌంటర్ దాఖలు చేసింది. అందులో సీఎం జగన్ పేరు కూడా ఉంది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ విచారణలో అకస్మాత్తుగా సీఎం జగన్ పేరు ప్రస్తావించారని, కౌంటర్ లో సీఎం జగన్ పేరును పేర్కొనడం చిల్లర చేష్టగా అనిపించిందని విమర్శించారు. విచారణ పేరుతో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa