కేరళలో అవినీతి రాజ్యమేలుతుందని, అవినీతి యూనివర్సిటీకి ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ శుక్రవారం అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రసంగం నవ్వు తెప్పిస్తున్నదని పేర్కొన్న సతీశన్, తన కార్యాలయంలో జరుగుతున్న అవినీతి గురించి ఆయనకు (ముఖ్యమంత్రికి) తెలియదా అని ప్రశ్నించారు. అవినీతి అధికారుల పట్ల తమ ప్రభుత్వం కనికరం చూపదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం అన్నారు. పాలక్కాడ్ లంచం కేసులో గ్రామ సహాయకుడు లంచం తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు.కేరళ పోలీసుల విజిలెన్స్ విభాగం మంగళవారం లంచం తీసుకుంటూ పట్టుబడిన గ్రామ సహాయకుడి నివాసంలో సోదాలు నిర్వహించగా కోటి రూపాయలకు పైగా నగదు, బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకుంది.