మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఎంపీ, ప్రముఖ బీజేపీ నేత రాజ్‌కుమార్ రంజన్సింగ్పై దుండగులు దాడి చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఇంఫాల్‌లో శుక్రవారం రాత్రి ఆందోళనకారులు వాహనాలు, దుకాణాలను తగలబెట్టారు. అనంతరం భద్రతా బలగాలు వారిని తరిమికొట్టాయి. ఇంఫాల్ తూర్పు మరియు పశ్చిమ రెండింటిలోనూ కర్ఫ్యూ విధించారు.