గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మే 29 నుండి జూన్ 3 వరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం హాజరు నమోదు చేసే HRMS పోర్టల్ లోనే దరఖాస్తు కోసం ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంచుతామని, అవసరమైన సర్టిఫికెట్లపై సంతకాలు చేసి అప్ లోడ్ చేయాలన్నారు. మే చివరి నాటికి జిల్లాల వారీగా, ఉద్యోగ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు పోర్టల్ లో ఉంటాయన్నారు.