కొత్తగా హోమ్‌లోన్ తీసుకునే కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అద్భుతమైన ఆఫర్ తెచ్చింది. వడ్డీ రేటుపై ఏకంగా 45 బేసిస్ పాయింట్స్ తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్బీఐలో హోమ్‌లోన్ వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంటే, ఆఫర్లో 8.70 శాతం వడ్డీ మాత్రమే వర్తిస్తుంది. క్రెడిట్ స్కోర్ 750 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉన్నవారు ఈ ఆఫర్ పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ జూన్ 30 వరకే వర్తిస్తుంది.